Share News

Kharif Cultivation: కరువు తీరింది

ABN , Publish Date - Aug 17 , 2025 | 03:51 AM

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో కోస్తాంధ్రలో వాన లోటు తీరింది. రాయలసీమలోనూ వర్షపాతం మెరుగైంది.

Kharif Cultivation: కరువు తీరింది

  • ఖరీఫ్‌ సాగు పుంజుకుంది

  • వరుస అల్పపీడనాలతో దంచుతున్న వానలు

  • 24 నుంచి 8.6 శాతానికి తగ్గిన వాన లోటు

  • సీమలో మెరుగైన వర్షపాతం.. కోస్తాలో జోరుగా వరి నాట్లు

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో కోస్తాంధ్రలో వాన లోటు తీరింది. రాయలసీమలోనూ వర్షపాతం మెరుగైంది. ఖరీఫ్‌ సాగు ఊపందుకుంది. గతనెలాఖరు వరకు 24 శాతం ఉన్న వాన లోటు ఇప్పుడు 8.6 శాతానికి తగ్గింది. జూన్‌1 నుం చి ఈ నెల 16 వరకు 316.4 మిల్లీమీటర్ల వాన పడాల్సి ఉండగా, 346.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా, నం ద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణ స్థాయిలో, శ్రీకాకుళం, విశాఖ, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యింది.అయితే వాతావరణ శాఖ ప్రకటించినవిధంగా ఈ నెల 18న ఏర్పడే అల్పపీడనంతో భారీ వర్షాలు కురిస్తే.. అన్ని జిల్లాల్లో వాన లోటు పూర్తిగా తీరిపోతుంది. కాగా ఈ ఏడాది ముందే వచ్చిన నైరుతి రుతుపవనాలు నెల రోజులపైగా మందగించి అన్ని ప్రాంతాల్లో సరైన వర్షాలు పడలేదు. కానీ గత నెలాఖరు, ఈ వారం భారీ వర్షాలు కురవడంతో మెట్ట ప్రాంతాల్లో ఖరీఫ్‌ సాగు ఊపందుకుం ది.ప్రస్తుతం పత్తి, అపరాలు, వేరుశనగ సాగు పుంజుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర, వంశధార నదులకు వరదలు రావడం, ప్రభుత్వం కాలువల మరమ్మతులు కూడా చేపట్టడంతో చివరి భూములకూ నదీ జలాలు పారుతున్నాయి. దీంతో డెల్టా ప్రాంతాల్లోని మాగాణి భూముల్లో రైతులు వరి సాగు చేపట్టారు.చాలాచోట్ల వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 03:51 AM