Share News

AP Weather: ప్రభావం చూపని ద్రోణి

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:27 AM

పశ్చిమ బెంగాల్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని నుంచి జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ మీదుగా గుజరాత్‌ వరకూ ఉపరితల ద్రోణి విస్తరించింది. అయితే ఆవర్తనం, ద్రోణి.. ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం చూపడం లేదు.

AP Weather: ప్రభావం చూపని ద్రోణి

  • తగ్గిన వర్షాలు.. పెరిగిన ఉష్ణోగ్రత

  • నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని నుంచి జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ మీదుగా గుజరాత్‌ వరకూ ఉపరితల ద్రోణి విస్తరించింది. అయితే ఆవర్తనం, ద్రోణి.. ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం చూపడం లేదు. కానీ అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో రాయలసీమ, కోస్తాల్లోని కొన్ని చోట్ల శుక్రవారం వర్షాలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. తిరుపతిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నాలుగైదు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అప్పటివరకూ రాష్ట్రంలో వర్షాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 03:29 AM