Share News

నడిరోడ్డుపై నడిపించుకుంటూ..

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:50 AM

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడిని పోలీసులు నడిరోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన ఘటన గురువారం ఉయ్యూరులో జరిగింది.

నడిరోడ్డుపై నడిపించుకుంటూ..

బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు

ఉయ్యూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడిని పోలీసులు నడిరోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన ఘటన గురువారం ఉయ్యూరులో జరిగింది. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న మేనకోడలు వరసయ్యే చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి షేక్‌ చాన్‌ బాషా(30) పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను చాకుతో బెదిరించేవాడు. రెండు రోజుల క్రితం విషయం బయటకు పొక్కడంతో స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఉయ్యూరులోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నవంబరు 5వ తేదీ వరకు నిందితుడికి రిమాండ్‌ విధించారు.

Updated Date - Oct 24 , 2025 | 12:50 AM