Fencing Association: అఖిల భారత ఫెన్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా సుగుణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:09 AM
అఖిల భారత ఫెన్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాకినాడ రూరల్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): అఖిల భారత ఫెన్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నైనిటాల్‌లో జరిగిన అఖిల భారత ఫెన్సింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో సంఘ అధ్యక్షులు రాజీవ్ మెహతా, పలు రాష్ట్రాల ఫెన్సింగ్ ప్రతినిధుల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొనగా సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ సుగుణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఏపీ ఉత్తమ స్థానంలో నిలిచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సుగుణారెడ్డిని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.శేషారెడ్డి అభినందించారు.