Share News

Record Achievement: 73 ఏళ్లు.. 73 డిగ్రీలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:40 AM

సుదీర్ఘ కాలంగా నిత్య విద్యార్థిగా జ్ఞాన సముపార్జనే జీవన విధానంగా మార్చుకున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ...

Record Achievement: 73 ఏళ్లు.. 73 డిగ్రీలు

  • చదువుల్లో ‘మెగాస్టార్‌’ డాక్టర్‌ కర్రి రామారెడ్డి

  • తాజాగా ఒకే సెమిస్టర్లో 12 ఎన్‌పీటీఈఎల్‌ సర్టిఫికెట్‌ కోర్సులు!

రాజమహేంద్రవరం కల్చరల్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ కాలంగా నిత్య విద్యార్థిగా జ్ఞాన సముపార్జనే జీవన విధానంగా మార్చుకున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి మరో మైలు రాయిని అధిగమించారు. ఇప్పటికే పలు భిన్నమైన డిగ్రీలు సాధించిన ఆయన, దేశంలోనే పేరుగాంచిన ఐఐటీ సంస్థలు నిర్వహించే ఎన్‌పీటీఈఎల్‌ కోర్సులను పూర్తిచేయడంపై దృష్టి సారించి ఒకే సెమిస్టర్‌లో 12 కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అంతేకాక, పరీక్షా ఫలితాల్లో 8 కోర్సులు విశిష్ట శ్రేణి(ఎలైట్‌ ప్లస్‌ గోల్డ్‌), 4 కోర్సులు విశిష్ట శ్రేణి(ఎలైట్‌ ప్లస్‌ సిల్వర్‌)లోనూ ఉత్తీర్ణత పొంది, వరుసగా మూడోసారి ‘మెగాస్టార్‌’ టైటిల్‌ను కైవశం చేసుకున్నారు. తాజాగా సాధించిన 12 సర్టిఫికెట్‌ కోర్సులతో కలిపి మొత్తం 73కు చేరుకున్నాయి.


డిగ్రీలన్నీ పరీక్షలు రాసి సంపాదించినవే: రామారెడ్డి

రాజమహేంద్రవరంలోని మానస హాస్పిటల్‌లో రామారెడ్డి మీడియాతో మంగళవారం మాట్లాడారు. తాను పూర్తిచేసిన అన్ని డిగ్రీలూ.. పరీక్షల ఆధారంగా సంపాదించినవేనని, ఏదీ ఆయాచితంగా గానీ, గౌరవపూర్వక నామమాత్రపు అర్హతతో పొందినవి కానీ లేవని స్పష్టం చేశారు. వచ్చే సెమిస్టర్‌ కోర్సులో 16 కోర్సులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రామారెడ్డి తెలిపారు.

Updated Date - Nov 26 , 2025 | 06:41 AM