Share News

BJP State President P.V.N. Madhav: వికసిత్‌ భారత్‌ దిశగా.. వికసిత్‌ ఏపీ లక్ష్యంగా..

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:02 AM

కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు...

BJP State President P.V.N. Madhav: వికసిత్‌ భారత్‌ దిశగా.. వికసిత్‌ ఏపీ లక్ష్యంగా..

  • డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో ప్రగతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. విజయవాడలోని ఒక హోటల్లో బుధవారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరితో కలిసి మాధవ్‌ మీడియాతో మాట్లాడారు. మోదీ సారథ్యంలో దేశం.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం.. సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు కూటమితో సమన్వయం చేసుకుని పోటీకి సిద్ధపడాలని మాధవ్‌ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెడితే.. కూటమి ప్రభుత్వం మోదీ సహకారంతో రాష్ట్ర ప్రజల రాజధాని నిర్మాణ కలను సాకారం చేస్తోందని చెప్పారు. వైసీపీ అబద్ధాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, బీజేపీ శ్రేణులు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ పాకా సత్యనారాయణ, బీజేపీ పదాధికారులు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలు నరకం చూశారు: సత్యకుమార్‌

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించి, చీకటి పాలన అందించిన జగన్‌... కూటమి ప్రభుత్వంలో వెలుగుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. వైసీపీ చీకటి పాలన గురించి తలుచుకుని ప్రజలు ఇప్పటికీ వణికిపోతున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ప్రతి ఇంటినీ కమ్మేసిన చీకటిని కూటమి ప్రభుత్వం తరిమేసి, వెలుగులు నింపుతుంటే.. జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

Updated Date - Oct 23 , 2025 | 05:02 AM