Share News

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయొద్దు

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:23 AM

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం తగద ని కడప డివిజన ఆల్‌ ఇండియా ఇన్సూ రెన్స ఎంప్లాయిస్‌ అసోసియేషన అధ్యక్ష, కా ర్యదర్శులు శ్రీనివాస్‌, రఘునాఽథరెడ్డి డిమాం డ్‌ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయొద్దు
మాట్లాడుతున్న రఘునాథరెడ్డి

ఆత్మకూరు రూరల్‌ , అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం తగద ని కడప డివిజన ఆల్‌ ఇండియా ఇన్సూ రెన్స ఎంప్లాయిస్‌ అసోసియేషన అధ్యక్ష, కా ర్యదర్శులు శ్రీనివాస్‌, రఘునాఽథరెడ్డి డిమాం డ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎల్‌ఐ సీ కార్యాలయంలో ఆ యూనియన సర్వ సభ్య సమావేశం నిర్వహించి, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో చేస్తున్న సవరణలతో కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎల్‌ఐసీ పబ్లిక్‌ సెక్టార్‌ను బలోపేతం చేయాలని, ఎల్‌ఐసి సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి, ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆత్మకూరు ఎంప్లాయిస్‌ యూనియన అధ్యక్షుడిగా విజయ్‌కుమార్‌, కార్యదర్శిగా రవికుమార్‌, జాయింట్‌ సెక్రటరీలుగా నాగన్న,సుచిత్ర, ట్రెజరర్‌గాజబివుల్లా, ఈసీ మెంబర్లుగా అమీర్‌హంజా, శోభారాణి,చంద్రశేఖర్‌, నాగేంద్ర కుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డివిజనల్‌ జాయింట్‌ సెక్రటరి సునయకుమార్‌, లియాఫి నాయకులు అబ్దుల్‌ కరీం, రాంబాబు,కలిముల్లా, డీవోల సంఘం అధ్యక్షులు జగన్నాథరాజు,ఉద్యోగులు, ఏజంట్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:23 AM