మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించొద్దు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:27 AM
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించొద్దని, ఇది దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాసా అన్నారు.
నంద్యాల నూనెపల్లి, నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించొద్దని, ఇది దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాసా అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు బుధవారం పట్టణంలోని ఉదయానందా రెసిడెన్సీ నుంచి వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కు చేరుకోని జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చే యాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్ఫ్కెడ్ ఛైర్మన పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన మా బున్నిసా, వైసీపీ స్టేట్ కౌన్సిల్ నంబర్సు సాయినాథ్‌రెడడ్డి, రామలింగారెడడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైసీపీ జిల్లా ప్రధదాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, నంద్యాల వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, స్టేట్ వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళరెడ్డి పాల్గొన్నారు.
నందికొట్కూరు/రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గపు ఆలోచన అని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ అన్నారు. బుధవారం పట్టణంలోని పటేల్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సేవ్ మెడిక్ కళాశాలలు అంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డా.ధార సుధీర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. అనంతరం డీటీ సోమేశ్వరీదేవికి వినతి పత్రం అందజేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆత్మకూరు: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడం అన్యాయమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నంద్యాల టర్నింగ్‌లో దివంగత వైఎ్‌సఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి కేజీరోడ్డు, పాతబస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రమణమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, మధుసూదనరెడ్డి, నాయకులు సయ్యద్‌మీర్, మారుబత్తుల విజయ్, మనీర్‌బాషా తదితరులున్నారు.