Share News

Anantapur District: చిన్నారి వైద్యానికి స్పందిస్తున్న దాతలు

ABN , Publish Date - Oct 27 , 2025 | 04:15 AM

అరుదైన వ్యాధి బారిన పడి చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురానికి చెందిన అక్షయ గ్రేస్‌ (12)కు పలువురు సాయం అందిస్తున్నారు.

Anantapur District: చిన్నారి వైద్యానికి స్పందిస్తున్న దాతలు

  • రూ.7 లక్షల వరకు అందిన సాయం

గార్లదిన్నె, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): అరుదైన వ్యాధి బారిన పడి చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురానికి చెందిన అక్షయ గ్రేస్‌ (12)కు పలువురు సాయం అందిస్తున్నారు. బాలిక పరిస్థితిపై ‘పేదింటి చిన్నారికి అరుదైన వ్యాధి’ శీర్షికన ఆదివారంనాడు ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో పలువురు ఆపన్న హస్తం అందిస్తున్నారు. చిన్నారి తండ్రి ఆంజనేయులుకు ఫోన్‌ చేసి, వ్యాధి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.7 లక్షలు తమ ఖాతాల్లోకి జమ అయినట్టు చిన్నారి తండ్రి ఆంజనేయులు తెలిపారు. ఇందుకు ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Oct 27 , 2025 | 04:17 AM