Temple Hundi Frauds: దేవదాయంలో హుండీ దొంగలు!
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:43 AM
దేవాలయాల్లో హుండీలను కొట్టేసే దొంగల వ్యహారాలు అక్కడక్కడా వెలుగులోకి వస్తుండడం చూస్తూనే ఉంటాం!.. కానీ.. కంచే చేను మేసే చందంగా దేవదాయశాఖలోనూ కొందరు ఇంటి దొంగలు హుండీలను కాజేస్తున్నట్లు తీవస్ర్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో...
చాలా ఆలయాల్లో కానుకల సొమ్ము గుటుక్కు
దేవుడి ఆదాయం.. ఇంటి దొంగల జేబుల్లోకి..!
కొంతమంది ఈవోలకు హుండీలో బంగారమే టార్గెట్
లెక్కింపు సమయంలో 15 నుంచి 20 శాతం పక్కదారి
ఆలయ అధికారులు, ధర్మకర్తల సహకారంతోనే!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దేవాలయాల్లో హుండీలను కొట్టేసే దొంగల వ్యహారాలు అక్కడక్కడా వెలుగులోకి వస్తుండడం చూస్తూనే ఉంటాం!.. కానీ.. ‘కంచే చేను మేసే’ చందంగా దేవదాయశాఖలోనూ కొందరు ఇంటి దొంగలు హుండీలను కాజేస్తున్నట్లు తీవస్ర్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో ‘పరకామణి’ చోరీ కేసు ఎంత సంచలన సృష్టించిందో తెలిసిందే! ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఉన్న చాలా ఆలయాల్లో ఇలాంటి చోరీలు కోకోల్లలుగా జరుగుతున్నాయి. హుండీ లెక్కిపుల సమయంలో.. కోట్ల రూపాయల కానుకల సొమ్ములు పక్కదారి పడుతున్నాయి. శాఖ పరిధిలో దాదాపు 20 వేలకు పైగా ఆలయాలు ఉండగా.. వీటికి హుండీతో పాటు దాతల విరాళాలు, భూములు, షాపుల లీజులతో పాటు ఇతర మార్గాల ద్వారా కోట్లలో ఆదాయం వస్తోంది. అయితే ఇలా వచ్చే కానుకల సొమ్ములో సగటు 15 నుంచి 20 శాతం పక్కదారిపడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా హుండీలు తెరిచే సమయంలో సరైన పద్ధతులు పాటించకపోవడం, పాత కాలం నాటి మార్గదర్శకాల వల్లే దేవుడి సొమ్ము ఇలా ఇంటి దొంగలపాలవుతోంది. ఇందులో ఆలయ అధికారుల, పాలక మండలితో పాటు వంశపారపర్య ధర్మకర్తల మండలి పాత్ర కూడా ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పల్నాడు జిల్లాలోని ఒక ప్రముఖ ఆలయంలో వెలుగు చూసిన సంఘటనే దీనికి ఉదాహరణ. పల్నాడు జిల్లాలో పేరొందిన ఓ అమ్మవారి ఆలయానికి ఏటా కోట్లలో ఆదాయం వస్తోంది. సదరు ఆలయంలో ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి హుండీ తెరిచి, కానుకల సొమ్మును స్థానిక సిబ్బంది, భక్తుల సమక్షంలో లెక్కిస్తూ వస్తున్నారు. అనంతరం ఆ ఆదాయం మొత్తం బ్యాంకుల్లో జమ చేయాలని అందరి సమక్షంలో నిర్ణయిస్తున్నారు. కానీ ఆలయ ధర్మకర్తలు, అధికారులు కలిసి సగం మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, మిగిలిన ఆదాయాన్ని ఇరు వర్గాల వారు వాటాలేసుకుంటున్నట్లు బయటపడింది. ధర్మకర్తల మండలి, అధికారుల మధ్య వాటాల దగ్గర తేడా రావడంతో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఈ పంచాయితీ కాస్త దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం వరకూ వచ్చినా.. ఉన్నతాధికారులు సైతం మిన్నకుండిపోవడగం గమనార్హం. దీంతో పాటు ఆలయాల్లో హుండీల్లో చేతులు పెట్టి చోరీ చేసే సంఘటనలూ నమోదవుతున్నాయి.
ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఈవోకి దేవుడి కానుకల్లో బంగారం అంటే భలే ఇష్టం! సర్వీ్‌సలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఆలయంలో పనిచేసినా.. అక్కడ హుండీలో వచ్చే బంగాగంలో తనకంటూ కొంత వెనకేసుకుంటారని పేరుంది. ఇప్పటి వరకూ కొన్ని వందల గ్రాముల బంగారాన్ని దారిమళ్లించేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొంత మంది ఈవోలు హుండీ లెక్కింపు అనంతరం.. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని సొంత కార్లలో తీసుకుని ఇళ్లకు వెళ్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నాయో.. లేదా సొంత అవసరాలకు వాడుతున్నారో అన్న దానిపై ఎవరి పర్యవేక్షణా ఉండడం లేదు.
సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉండాలి
రాష్ట్రంలో మేజర్ ఆలయాలతో పాటు, డీసీ, ఆర్జేసీ, ఏసీ కేడర్ ఆలయాల్లో హుండీలు తెరిచే సమయంలో సరైన మార్గదర్శకాలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు సీఎం చంద్రబాబు.. ప్రతి పనికీ టెక్నాలజీ ఉపయోగించండి, అప్పడే పాదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉంటుందని చెబుతున్నా.. అధికారులు మాత్రం ఇంకా మూస పద్ధతితో బీసీ కాలం నాటి మార్గదర్శకాలనే పాటిస్తున్నారు. దీని వల్ల దేవుడికి రావాల్సిన ఆదాయం.. ఇంటి దొంగ చేతుల్లోకి వెళ్తోంది. ఇకనైనా ప్రతి ఆలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే హుండీలు తెరిచేలా ఏర్పాటు చేయాలి. 6 సి ఆలయాలకు సంబంధించిన సీసీ కెమెరాలు అసిస్టెంట్ కమిషనర్, 6 బీ ఆలయాలు డిప్యూటీ కమిషనర్, 6 ఎ ఆలయాల్లోని సీసీ కెమెరాలను ఆర్జేసీ కార్యాలయాలకు అనుసంధానం చేయాలి. అక్కడి నుంచి సెంట్రలైజ్డ్ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, హుండీల లెక్కింపు సమయంలో సదరు ఆలయానికి సంబంధించిన సీసీ కెమెరాలను ఏసీ, డీసీ, ఆర్జేసీ కార్యాలయల్లో పర్యవేక్షిస్తే తప్ప హుండీ దొంగలకు చెక్ పడే పరిస్థితి లేదు!.