AP Ministers: ఫైళ్ల పరుగు ఇలా!
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:11 AM
ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ముందు వరసలో ఉన్నారు. ఆయన లాగిన్‌కు ఫైల్ రాగానే సగటున రెండు రోజుల 41 నిమిషాల వ్యవధిలోన ేచూసి పరిష్కరిస్తున్నారు. గత ఏడాది జూలై 15 నుంచి ఈ నెల 9 వరకు 651 ఫైళ్లు పరిష్కరించారు...
డోలా, నిమ్మల, ఫరూక్ టాప్.. సీఎం, లోకేశ్‌కు, 3 రోజులు
దుర్గేశ్, సత్యకుమార్ కూడా
పవన్ కల్యాణ్, కొండపల్లికి 4 రోజులు
15 రోజులు తీసుకుంటున్నకొల్లు, రాంప్రసాదరెడ్డి
సర్కారుకు ఐటీ శాఖ నివేదిక
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ముందు వరసలో ఉన్నారు. ఆయన లాగిన్‌కు ఫైల్ రాగానే సగటున రెండు రోజుల 41 నిమిషాల వ్యవధిలోన ేచూసి పరిష్కరిస్తున్నారు. గత ఏడాది జూలై 15 నుంచి ఈ నెల 9 వరకు 651 ఫైళ్లు పరిష్కరించారు. ఆ తర్వాతి స్థానం మంత్రి నిమ్మల రామానా యుడిది. సగటున తన లాగిన్‌కొచ్చిన ఫైలును చూసేందుకు రెండు రోజుల 7 గంటల సమయం తీసుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఒక్క ఫైలు కూడా పార్కింగ్(ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టడం) లో ఉంచలేదు. మూడో స్థానంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు 1,532 ఫైళ్లు పరిష్కరించగా, సగటున తనకొచ్చిన ఫైలును పరిశీలించేందుకు రెండు రోజుల 9.59 గంటల సమయం తీసుకుంటు న్నారు. అయితే ఈయన 20 ఫైళ్లు పార్కింగ్‌లో పెట్టారు. ఫైళ్ల పరిష్కారం, లాగిన్‌కొచ్చిన ఫైళ్లు చూసుకునే సమయం ఆధారంగా ఇచ్చిన డేటాలో ముఖ్యమంత్రి చంద్రబాబుది 6వ స్థానం. నిజానికి, మంత్రుల అందరికంటే సీఎంకు ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఆయనకు 6,713 ఫైళ్లు రాగా 6,653 పరిష్కరించారు. అత్యధికంగా 401 ఫైళ్లను పార్కింగ్ లో ఉంచారు. ఆయన ఫైల్స్‌ను చూసేందుకు సగటున 3 రోజుల 8.18 గంటల సమయం తీసుకుంటున్నారు. ఐటీ, విద్యా శాఖల లోకేశ్‌ది 9వ వస్థానం. ఆయన లాగిన్‌కు మొత్తం 3,916 పైల్స్ రాగా, 3,669 పరిష్కరించారు. 266 పార్కింగ్‌లో ఉంచారు. ఒక ఫైల్‌ను చూసేందుకు సగటున 3 రోజుల 14:10 గంటలు తీసుకుం టున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కలా ణ్ 11వ స్థానంలో ఉన్నారు. ఆయన 2,001 ఫైళ్లు పరిష్కరించారు. 67 పార్కింగ్‌లో ఉంచారు. తన లాగిన్‌కొచ్చిన ఫైళ్లను చూసేందుకు ఆయన సగటున 4 రోజుల 9.43 గంటల సమయం తీసుకుంటున్నారు. అచ్చెన్నాయుడి లాగిన్‌లో 127 ఫైళ్లు పార్కింగ్‌లొ ఉన్నాయి. పైళ్ల పరిష్కారంలో ఈయన స్థానం 15.
శాఖల్లో పెండింగ్ ఇలా..
సకాలంలో ఫైళ్లు చూడడంలో కొందరు ఐఏఎ్‌సలు ముందు వరసలో ఉంటే.. మరి కొందరు బాగా వెనకబడిపోయారు. ఐపీఎస్ అధికారి రాహుల్‌దేవ్ శర్మ సగటున 18 రోజుల 2.45 గంటల సమయం తీసుకుంటున్నారు. ఐఏఎస్ అధికారి రేఖారాణి 11 రోజుల 5.26 గంటల సమయం తీసుకుంటున్నారు. సచివాలయం స్థాయిలో ఫైళ్ల పెండింగ్ భారీగా ఉంటోందని నివేదిక తేటతెల్లం చేసింది. పరిశ్రమల శాఖలో ఒక ఫైలు చూసేందుకు 27 రోజులు, పంచాయతీరాజ్‌లో 24 రోజులు, ఇంధన శాఖలో 23 రోజులు, రెవెన్యూలో 21 రోజుల సమయం పడుతోంది. పాఠశాల విద్యలో 16 రోజులు, ఉన్నత విద్యలో 15 రోజులు పడుతోంది. గిరిజన శాఖలో ఫైళ్లను చూడడానికి 12 రోజుల సమయం పడుతుండటం పట్ల సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసులో మాత్రమే ఒక్క రోజులోనే ఫైలు చూసి పరిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈ-ఆఫీస్ ఫైల్‌పై నివేదిక సమర్పించిన కాటమనేని భాస్కర్ వద్ద కూడా 102 ఫైళ్లు పార్కింగ్‌లో ఉండడం గమనార్హం.
జిల్లాల్లో చురుగ్గా క్లియరెన్సు
దాదాపు కలెక్టర్లందరూ ఫైళ్ల పరిష్కారంలో చురుగ్గా ఉన్నారు. 8 జిల్లాల్లోనే ఫైళ్లు పార్కింగ్‌లో ఉన్నాయి. అవి కూడా 6లోపే. జేసీలు కూడా వేగంగా పరిష్కరిస్తున్నారు. నలుగురే పార్కింగ్‌లో ఉంచారు. కృష్ణా జిల్లా కలెక్టరు సగటున ఫైళ్లను 14 గంటల 42 నిమిషాల్లో పరిష్కరిస్తూ మొదటి ర్యాంకు సాధించారు. తిరుపతి జేసీ సగటున ఒకరోజు 11 నిమిషాల్లో ఫైళ్లు పరిష్కరిస్తున్నారు.
ఆ ఇద్దరూ బాగా వెనుకబడ్డారు
ఈ-ఆఫీసు ఫైళ్లను చూడడంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర వెనుకబడ్డారు. ఫైలు చూసేందుకు రాంప్రసాద్‌రెడ్డి సగటున 15 రోజుల 19.53 గంటలు తీసుకుంటున్నారు. కొల్లు రవీంద్ర 15 రోజుల 5:23 గంటలు తీసుకుంటున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్‌కు 11 రోజులు పడుతోంది. ఈయన చివరి నుంచి మూడోస్థానంలో నిలిచారు. ఐటీ శాఖ నివేదిక ప్రకారం సీఎం, మంత్రుల ఈ-ఆఫీ్‌సల్లో 978 ఫైళ్లు పార్కింగ్‌లో ఉన్నాయి. వీటిలో సీఎం 401, లోకేశ్ 266 పార్కింగ్‌లో ఉంచారు.