Share News

Former minister Dokka Manikyavaraprasad: సజ్జల.. అమరావతిలో సంచరిస్తున్న తెల్లత్రాచు

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:08 AM

అమరావతి ప్రాంతంలో సంచరిస్తున్న తెల్ల త్రాచు పాములు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల బార్గవ్‌రెడ్డి. వారితో జాగ్రత్తగా ఉండాలి’ అని మాజీ మంత్రి డొక్కా...

Former minister Dokka Manikyavaraprasad: సజ్జల.. అమరావతిలో సంచరిస్తున్న తెల్లత్రాచు

  • మూడు రాజధానులపై జగన్‌ వైఖరి మారదు: డొక్కా

గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘అమరావతి ప్రాంతంలో సంచరిస్తున్న తెల్ల త్రాచు పాములు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల బార్గవ్‌రెడ్డి. వారితో జాగ్రత్తగా ఉండాలి’ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. శనివారం గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘గాడ్‌ఫాదర్‌ సినిమాలో టామ్‌ హాగెన్‌ పాత్ర సజ్జల పోషిస్తున్నారు. రాజధాని విషయంలో వైఎస్‌ జగన్‌ వైఖరి మారినట్లు సజ్జల చెప్పినా ప్రజలు నమ్మరు. వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి చేత రాజధాని అమరావతే అని చెప్పించాలి. వైసీపీ విషయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్‌రెడ్డి మారే వ్యక్తి కాదు. మీ మోసం ప్రజలందరికీ అర్థమైంది. అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని దారుణంగా తిరస్కరించారు’ అని డొక్కా అన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 04:08 AM