తెర వెనుక వైద్యుడు
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:34 PM
రోగులకు వైద్యం చేసేది డాక్టర్లు.. రోగుల సేవల్లో కీలకపాత్ర పోషించేది ఫార్మసిస్టులు.
ఔషధ తయారీ నిపుణులు
వైద్య రంగంలో కీలకం ఫార్మసిస్టు
నేడు వరల్డ్ ఫార్మసిస్టు డే
రోగులకు వైద్యం చేసేది డాక్టర్లు.. రోగుల సేవల్లో కీలకపాత్ర పోషించేది ఫార్మసిస్టులు. మందుల తయారీ నుంచి డాక్టర్ ప్రిస్కిప్షన అర్థం చేసుకునే వరకు ఫార్మసిస్టులు కీలకం. అందుకే వీరిని తెర వెనుక వైద్యులని అంటుంటారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల తర్వాత ఫార్మసిస్టులు అత్యంత ముఖ్యమైన వారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టుల సేవలను గుర్తించడానికి సెప్టెంబరు 25న ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన వరల్డ్ ఫార్మసిస్టుల డేను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ‘ఆరోగ్యం గురించి ఆలోచించండి. ఫార్మసిస్టును గురించి ఆలోచించండి’ అన్న నినాదాన్ని ఇచ్చింది. వరల్డ్ ఫార్మసిస్టుల డేను పురస్కరించుకొని ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే అందులో ఫార్మసిస్టుల పాత్ర కీలకం. మందులు నిత్యావసరాల జాబితాలో చేరిపోయాయి. బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి నుంచి స్వల్ప అనారోగ్యాలకు గురైన వారి వరకు మందులను వినియోగిస్తారు. ఔషధాలను రాసేది వైద్యుడే అయినా వాటిని మోతాదులో.. ఎలా వినియోగించేది రోగులకు వివరించేది ఫార్మసిస్టులే.
ఉమ్మడి జిల్లాలో 12వేల మంది
కర్నూలు, నంద్యాల జిల్లాలో 15 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ వైద్య విధాన పరిషత, ప్రాతమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన హెల్త్ సెంటర్లు, కర్నూలు జీజీహెచ, ఏరియా ఆసుపత్రులు, రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, 104 సెంటర్ డ్రగ్ స్టోర్‌లో ఫార్మసిస్టులుగా పని చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో 2,500 మెడికల్ షాపులు, హోల్‌సేల్ షాపులున్నాయి. వీటిని ఫార్మసిస్టులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు ఫార్మసి కాలేజీల నుంచి ఏటా 500 మంది ఫార్మసిస్టులు బయటకు వస్తున్నారు.
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టు
సాధారణంగా మెడికల్ షాపు బోర్డులపై కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని రాసుకుంటారు. డాక్టర్ రాసే మందులు కాంబినేషన్లు అర్థం చేసుకునే వారు కనుక కెమిస్ట్ అని, మందుల గురించి అవగాహన కలిగిన వారు కాబట్టి డ్రగ్గిస్ట్ అంటారు.
ఇంటర్ బైపీసీ, ఎంపీసీ
ఫార్మసిస్టు కావడానికి ఫార్మసీ కోర్సులను చేయాల్సి ఉంటుంది. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థుల మార్కుల ఆధారంగా ఫార్మసిస్టులు కేటాయిస్తారు. ఫార్మాసూటికల్ రంగంలో రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్, ప్రొడక్షన కెమిస్ట్, ఎనలైటికల్ కెమిస్ట్, రెగ్యులర్ ఎఫైర్స్, ఇంటలెక్చువల్స్‌గా సేవలందిస్తున్నారు. ఆసుపత్రుల్లో క్లినికల్, కన్సల్టెంట్, వెటర్నిటీ ఫార్మసిస్టులుగా సేవలందిస్తున్నారు. డ్రగ్స్ ఇనస్పెక్టర్, అకడమిక్ అండ్ రీసెర్చ్‌గా కమ్యూనిటీ ఫార్మాసిస్టు, మిలిటరీ ఫార్మాసిస్టు, హోల్‌సేల్ అండ్ రిటైల్ ఫార్మాసిస్టులుగా సేవలందిస్తున్నారు.
ఫార్మసిస్టులు లేకుండానే దుకాణాలు:
ఉమ్మడి జిల్లాలో 3వేల మందుల షాపులున్నాయి. సాధారణంగా ఫార్మసిస్టులకే మందుల దుకాణాల నిర్వహణకు అనుమతి ఇస్తారు. చాలా వాటిలో ఫార్మసిస్టులే ఉండటం లేదు. కొందరైతే ఫార్మాసిస్టుల ద్వారా దుకాణానికి అనుమతులు తీసుకుంటూ స్వంతంగా నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సాధారణ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే మందులు కిరాణషాపుల్లోనూ విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆర్‌ఎంపీలు, ఫార్మసిస్టుల పాత్ర పోషిస్తూ వారిదగ్గరే మందులను ఉంచుకుని వైద్యసేవలందిస్తూ ప్రజలను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నారు.
అనుభవం అవసరం
కొత్త ఫార్మసిస్టులు ముందుగా అనుభవం తెచ్చుకోవాలి. రోగినిప్రిస్కిప్సన ప్రకారం మందులు ఎలా వేసుకోవాలో వివరించాలి. గతంతో పోలిస్తే కొత్తగా ఫార్మసిస్టు కోర్సు పూర్తి చేసిన వారు స్వంతంగా మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి షాపులకు ఆనలైనలో త్వరగా అనుమతులిస్తున్నాం.
ఫ ఏటీవీ రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్, ఉమ్మడి జిల్లా ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు,
ప్రజల ఆరోగ్యాన్ని..
ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమైంది. వైద్యులు రాసిన మందులను అర్థం చేసుకుని సరైన వాటిని వాఽ్యధిగ్రస్తులకు ఇవ్వడం ఫార్మసిస్టులు చేస్తుంటారు. కర్నూలు నగరంలో 800 మెడికల్ షాపు లున్నాయి. ఫార్మసిస్టులు మందులు ఎలా వాడాలో తెలిపి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో తోడ్పడుతారు.
ఫ పి.హనుమన్న, డ్రగ్స్ ఇనస్పెక్టర్, కర్నూలు అర్బన