19న డాక్ అదాలత
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:29 AM
పోస్టాఫీసులో అందిస్తున్న సేవలపై ఈనెల 19న డాక్ అదాలత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దనరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పోస్టాఫీసులో అందిస్తున్న సేవలపై ఈనెల 19న డాక్ అదాలత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దనరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాతబస్టాండు వద్ద ప్రధాన తపాలా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. పోస్టాఫీసు సేవలపై ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే పోస్టు కవర్ ద్వారా పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దనరెడ్డి, కర్నూలు డివిజనల్ కార్యాలయం, పాతబస్టాండు అడ్రస్సుకు ఈ నెల 15వ తేదీలోపు పంపించాలని ఆయన సూచించారు.