ప్లాస్టిక్ వస్తువులు వాడరాదు
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:51 PM
నిషేధి త ప్లాస్టిక్ వస్తువులు వాడరాదని శ్రీశైలం అటవీశాఖ సబ్ డీ ఎఫ్ వో బబితా కుమారి సూచించారు.
శ్రీశైలం, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): నిషేధి త ప్లాస్టిక్ వస్తువులు వాడరాదని శ్రీశైలం అటవీశాఖ సబ్ డీ ఎఫ్ వో బబితా కుమారి సూచించారు. శుక్రవా రం సుండిపెంట కాలనీ లో ఏపీ అటవీశాఖ వన్యప్రాణి వారోత్సవా లు నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అటవీశాఖ కార్యాలయం నుం చి అడవులను రక్షిద్దాం - వన్యప్రాణులను కాపాడుదాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో పరమేశులు, డీవైఆర్‌వో బషీర్ అహమ్మద్, ఎఫ్‌ఎస్‌వో మఽధనకుమార్, ఈడీసీ చైర్‌పర్సన ఎన.నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వన్యప్రాణులను కాపాడుకుందాం
వెలుగోడు : అడవులను పెంచి పర్యావరణను పరిరక్షించుకోని వణ్యప్రాణు ల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని వెలుగోడు ఇనచార్జి అటవీ అధికారి తాహేర్ అన్నారు. వణ్యప్రాణి వారోత్సవాలు పురస్కరించుకొని శుక్రవా రం వెలుగోడులో ర్యాలీ నిర్వహించారు. వణ్యప్రాణులు, అడవుల ప్రాముఖ్యత గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు.