Minister Sandhya Rani: జిల్లా స్థాయిలో డీసీఓ విధానం అమలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:18 AM
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, సక్రమంగా ఉండే విధంగా చూడాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు.
గిరిజన గురుకులాల సొసైటీ పాలకమండలి నిర్ణయం
అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ పాఠశాలల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, సక్రమంగా ఉండే విధంగా చూడాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ 27వ పాలకమండలి సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా స్థాయిలో డీసీఓ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న 81 గురుకుల విద్యాలయాల్లో నాలుగో తరగతి సిబ్బందిని సర్వీస్ ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించుకోవడానికి ఆమోదం తెలిపారు. 12 మినీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.