మరోసారి బీభత్సం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:51 AM
అన్నదాతల్ని అకాల వర్షాల భయం వీడటం లేదు. వారం పది రోజుల వ్యవఽధిలో మూడు సార్లు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు అన్నదాతల నడ్డి విరిచేశాయి.

తిరువూరు/ఏ కొండూరు, ఆంధ్రజ్యోతి: అన్నదాతల్ని అకాల వర్షాల భయం వీడటం లేదు. వారం పది రోజుల వ్యవఽధిలో మూడు సార్లు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు అన్నదాతల నడ్డి విరిచేశాయి. ఇప్పటికే రెండు సార్లు వీచిన ఈదురు గాలులకు నష్టపోయి పీపీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు మరోమారు ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఏకంగా వడగండ్ల వాన పడటంతో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. మొత్తం మీద రైతులను రూ.లక్షల్లో నష్టపోయేలా చేశాయి. అంతేకాక ఈదురు గాలులు కారణంగా పట్టణంలో పెద్ద ఎత్తున చెట్లు నేలవాలాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు విరిగిపోయాయి. బోర్డులు నేలమట్టమయ్యాయి.
పట్టణంలో అల్లకల్లోలం
తిరువూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడి భారీ వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి వేసవి వేడితో అల్లాడిన ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా చల్లగాలులతో వర్షం పడటంతో కొంత సేదతీరినా, వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండల పరిషత్ కార్యాలయంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పోల్ విరగిపోయి రోడ్డుపైకి ఒరిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగి నేలపై పడ్డాయి. ప్రధాన రహదారిలో వివిధ షాపులకు చెందిన విద్యుత్ నేమ్ బోర్డులు గాలులకు విరిగి సమీపంలోని ద్విచక్రవాహనాలపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిపేయడంతో పట్టణం పూర్తి అంధకారంలో చిక్కుకుంది. డ్రెయిన్స్ పూడిక తీయకపోవడంతో వరద నీరు రహదారిపై ప్రవహించి పంట కాలువల ను తలపించాయి. పలు గ్రామా ల్లో చెదువు మదురు జల్లులు పడ్డాయి. ధాన్యం కోసిన రైతులు క టల్లా టల్లో ఉంచిన ధాన్యంపై పట్టా టలు కప్పినా ఎగిరిపోయి తడిచిపోయాయి. వారంలో రెండు సార్లు వీచిన ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోగా కొద్దొ గొప్పో చెట్లకు న్న కాయలు పూర్తిగా రాలిపోయాయి.
మొక్కజొన్న రైతుల కుదేల్
ఈదురు గాలులకు మొక్కజొన్న రైతులు పూర్తిగా కుదేలయ్యారు. కొందరు రైతులు మొక్కజొన్న విరిపించి ఒలిపించి కల్లాల్లో పెట్టారు. వాటిపై కప్పిన పట్టా లు ఎగిరిపోవడంతో పంట పూర్తిగా తడిచిపోయింది. కొన్ని చోట్ల నేలవాలిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంభంపాడు - గోపాలపురం మధ్య రహదారి పక్కనున్న పలుచెట్లు విరిగిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. మండలం అంథకారంలో ఉండిపోయింది.