Liquor Scam: కిక్కు రుమనలేరు
ABN , Publish Date - May 22 , 2025 | 04:56 AM
మద్యం కుంభకోణంలో టెక్నాలజీ ఆధారంగా నిందితుల పాత్రలు ఎఫ్ఎస్‌ఎల్ నివేదికలతో బయటపడుతున్నాయి. ఇది టీడీపీ కక్షసాధింపే అని చెప్పే వైసీపీ వాదనలకు సిట్ నిర్ధారిత ఆధారాలతో చుక్కలు చూపించనుంది.
మద్యం స్కామ్‌లో పక్కాగా టెక్ ఆధారాలు
‘ఆర్డర్’ మెయిల్స్ నుంచి కలెక్షన్ కాల్స్ దాకా..
ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ
నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పణ
తప్పించుకునే అవకాశమే లేకుండా ఉచ్చు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
నేరం చేసిన వాళ్లు అబద్ధాలు చెప్పవచ్చు! ‘మాకేం తెలియదు. మేమే పాపమూ ఎరుగం’ అని అమాయకత్వం నటించవచ్చు. కానీ... టెక్నాలజీ అబద్ధం చెప్పదు! తప్పించుకోవడం అస్సలు కుదరదు! మద్యం కుంభకోణం కేసులో నిందితుల చుట్టూ ‘టెక్నాలజీ’ ఉచ్చు బిగుస్తోంది. ‘మద్యం కుంభకోణం జరగలేదు. ఇదంతా టీడీపీ కక్షసాధింపు. రెడ్‌బుక్ రాజ్యాంగం’ అంటూ వైసీపీ నేతలు, జగన్ సొంత మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్ చెప్పేందుకు ‘సిట్’ సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి, ముడుపుల ప్రవాహం ఎలా సాగింది.. ఎవరెవరికి చేరింది... అసలు వాటా దక్కించుకున్న ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరు... అనే వివరాలను ‘సిట్’ ఇప్పటికే సేకరించింది. ఇప్పుడు... దీనికి సంబంధించిన తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం కోర్టుకు ఈ నివేదిక సమర్పించే అవకాశముంది. దీంతో... లిక్కర్ స్కామ్ నిందితులు తప్పించుకోవడం అసాధ్యమని చెబుతున్నారు.
పక్కాగా ఆధారాలు... ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి అప్పటి ఎండీ వాసుదేవ రెడ్డి ఫైళ్లు ఎత్తుకెళ్లడం... ఆ ఫైళ్లతోపాటు అదే కార్యాలయంలో సీజ్ చేసిన కంప్యూటర్లు, మద్యం డిపోల్లో సేకరించిన డిజిటల్ ఆధారాలతో మొదలుకుని...
ఇటీవల హైదరాబాద్‌లో ఏ1 రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్‌డి్‌స్కలు, నిందితుల సెల్‌ఫోన్లు... ఇలా కీలక ఆధారాలన్నింటినీ సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని విశ్లేషించి... నిర్ధారణ నివేదిక తెప్పించుకున్నారు. దానితోపాటు సీజ్ చేసిన పరికరాలను కోర్టుకు సమర్పించబోతున్నారు.
ఎలా చేశారంటే..
మద్యం కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించింది బ్రాండ్ల ఆర్డర్లు! వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు... సేల్స్, డిమాండ్‌కు అనుగుణంగా కంప్యూటరే ఆర్డర్లు ఆటోమేటిక్‌గా పెట్టే సాఫ్ట్‌వేర్ ఉండేది. ఈ విధానాన్ని ఆర్డర్ ఫర్ సప్లై(ఓఎ్‌ఫఎస్) అంటారు. ఇందులో... మానవ ప్రమేయమేదీ ఉండదు. దీనినే కొనసాగిస్తే కమీషన్లు దక్కే అవకాశముండదని గత పాలకులు గ్రహించారు. ఆటోమేటిక్ విధానాన్ని ఆపేసి కొత్తగా మెయిల్ ద్వారా ఆర్డర్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ షాపు నుంచి మెయిల్ వస్తే... డిపో మేనేజర్లు సరుకు పంపించాలన్న మాట! కానీ... ఇందులోనే భారీ మతలబు చేశారు. లిక్కర్ షాపుల మెయిల్స్ అన్నీ మేనేజర్ల కంప్యూటర్ల నుంచే ఆపరేట్ అయ్యేవని ‘సిట్’ అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన కంప్యూటర్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపి పరీక్షించినప్పుడు ఈ విషయం పక్కాగా నిర్ధారణ అయ్యింది. మేనేజర్ల కంప్యూటర్లలో వారి పరిధిలోని షాపుల మెయిల్ ఐడీలు నిర్వహించిన స్ట్రోక్స్ స్పష్టంగా కనపడ్డాయని ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదిక ఇచ్చింది.
ఆ తర్వాత ఏమైందంటే..
లెక్క ప్రకారం... డిపో మేనేజర్లు డిస్టిలరీలకు ఆర్డర్లు ఇవ్వాలి. కానీ... అది కూడా చేయలేదు. ఏ1 రాజ్ కసిరెడ్డి నుంచి ఏ3 సత్యప్రసాద్‌కు వచ్చే సూచన మేరకే ఆర్డర్లు ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం సాయంత్రం అనూష అనే ఉద్యోగి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్ముడైన లిక్కర్ బ్రాండ్ల వివరాలను రాజ్ కసిరెడ్డి మొబెల్ వాట్సా్‌పకు పంపేవారు. ఆ వివరాల ఆధారంగా కసిరెడ్డి దగ్గర పనిచేసిన ముప్పిడి అవినాశ్‌రెడ్డి, బూనేటి చాణక్య తదితరులతో కూడిన బృందం వ్యాపారులకు ఫోన్లు చేసి కమీషన్లు సిద్ధం చేయాలని ఆదేశించేవారు. శనివారం ఏపీఎ్‌సబీసీఎల్ నుంచి బిల్లు మొత్తం మద్యంవ్యాపారుల ఖాతాల్లో పడగానే... కమీషన్‌ను రాజ్ కసిరెడ్డి మనుషులు సూచించిన ప్రాంతంలో వారికి అందజేసేవారు.
సైబర్ ఫోరెన్సిక్ ఏమి తేల్చింది..
డిపో మేనేజర్లకు సత్య ప్రసాద్ పంపించిన లిక్కర్ బ్రాండ్ల ఆర్డర్ డేటా వివరాలన్నీ సైబర్ ఫోరెన్సిక్ వెలికి తీసింది. ఏ రోజు సత్యప్రసాద్ మొబైల్ నుంచి డిపో మేనేజర్లకు ఏ బ్రాండ్ల జాబితా వచ్చిందో పక్కా టెక్నాలజీతో తేల్చేసింది. ఆ బ్రాండ్ల వ్యాపారులకు అంతకు ముందు బిల్లులు ఏపీఎ్‌సబీసీఎల్ నుంచి విడుదలయ్యాయా? ఆ తర్వాత కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుల నంబర్లతో మద్యంవ్యాపారులకు ఏ సమయంలో ఫోన్లు వచ్చాయి.. వారెంతసేపు మాట్లాడుకున్నారు.. అంతా అయ్యాక కలెక్షన్ బృందం కసిరెడ్డితో మాట్లాడిన వివరాలన్నీ సమయాలతో సహా సైబర్ ఫోరెన్సిక్ పూర్తిస్థాయిలో తేల్చేసింది. అనూషతోపాటు కార్యాలయంలో ఆర్డర్లు చూసే పనిచేసే సేఫ్ మొబైళ్ల నుంచి నివేదిక తీసుకున్నఅధికారులు.. హైదరాబాద్‌లో కసిరెడ్డి కార్యాలయాలు, ఇంట్లో సీజ్ చేసినవాటినీ ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపి సైబర్ ఫోరెన్సిక్ నివేదిక తెప్పించుకున్నారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి