కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ యాప్
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:48 PM
వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకే డిజిటల్ బుక్ యాప్‌ను తీసుకొచ్చినట్లు ని యోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ అన్నారు.
నందికొట్కూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకే డిజిటల్ బుక్ యాప్‌ను తీసుకొచ్చినట్లు ని యోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ అన్నారు. ఆదివారం ప ట్టణంలోని తన నివాసంలో డిజిటల్ బుక్ యాప్ పోస్టర్‌ను వైసీపీ నా యకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీ సభ్యులు యుగంధర్‌రెడ్డి, సోములసుధాకర్‌రెడ్డి, నాయకులు రమేష్ నాయుడు, మన్సూర్ అహ్మద్, నాగిరెడ్డి, మచ్చ నాగరాజు పాల్గొన్నారు.
మాది డిజిటల్ బుక్ : శిల్పా
వెలుగోడు : అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ అమలు చేస్తోందని, తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్ అమలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులతో కలిసి డిజిటల్ బుక్ స్కానర్ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపంరెడ్డి, రమేశ, రామసుబ్బారెడ్డి, షంషీర్, ఇలియాస్, ఆత్మకూరు నాయకులు పాల్గొన్నారు.