Share News

డిజిటల్‌ అగ్రి మిషనతో పేదల భూములకు ముప్పు

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:47 PM

డిజిటల్‌ అగ్రి మిషన పేరుతో ప్రభుత్వ, పేదల భూములను బహుళజాతి కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకరరెడ్డి ఆరోపించారు.

డిజిటల్‌ అగ్రి మిషనతో పేదల భూములకు ముప్పు
మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

- ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి

ఆత్మకూరు, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ అగ్రి మిషన పేరుతో ప్రభుత్వ, పేదల భూములను బహుళజాతి కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని ఓ ఫంక్షన హాల్‌లో జరిగే ఆ సంఘం జిల్లా రెండవ మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు పండించిన దిగుబడులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని అన్నారు. కార్పొరేట్‌ శక్తుల అప్పులను మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు రైతుల అప్పులను మాత్రం మాఫీ చేయడం లేదని ఆరోపించారు. డిజిటల్‌ మిషన పేరుతో పెద్ద వ్యవసాయ క్షేత్రాలను ప్రైవేట్‌ కంపెనీలకు అందించడం వల్ల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతులందరు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ఆయా సంఘాల జిల్లా నాయకులు రమేష్‌కుమార్‌, రాజశేఖర్‌, డాక్టర్‌ నాగన్న, రామకృష్ణ, ఏసురత్నం తదితరులున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:48 PM