TDP Supporter: ఇచ్చాపురం టు తిరుపతి దివ్యాంగుడి సైకిల్ యాత్ర
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:14 AM
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నెయ్యిల ప్రసాదరావు దివ్యాంగుడు.
చంద్రబాబు సీఎం అయితే వస్తానంటూ మొక్కు...
కోటబొమ్మాళి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నెయ్యిల ప్రసాదరావు దివ్యాంగుడు. తెలుగుదేశం అభిమాని. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా... చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అయితే సైకిల్‌పై తిరుపతి వస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లు చంద్రబాబు సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రసాదరావు ఈనెల 20న ఇచ్చాపురం నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టారు. శనివారం కోటబొమ్మాళిలోని కొత్తపేట కూడలికి చేరుకున్నారు. అక్కడ ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్చాపురం నుంచి 900 కిలోమీటర్ల మేర ఈ యాత్ర చేస్తున్నా. ఇది పూర్తి కావడానికి రెండు నెలలు పడుతుంది. తిరుపతి చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకుంటా’ అని తెలిపారు.