Share News

Manickam Thakur: మోదీ కాళ్లు పట్టుకున్న జగన్‌..తల్లి పాదాలకు మొక్కారా

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:42 AM

నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Manickam Thakur: మోదీ కాళ్లు పట్టుకున్న జగన్‌..తల్లి పాదాలకు మొక్కారా

  • మాణిక్కం ఠాకూర్‌ ధ్వజం

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏనాడైనా ఆయన తన తల్లి విజయలక్ష్మి పాదాలను బహిరంగంగా తాకారా? అని ఏపీసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి మాణిక్కం ఠాకూర్‌ అని నిలదీశారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా జగన్‌ను ఉద్దేశించి ఘాటైన ప్రశ్నలు సంధించారు. ‘ప్రధాని మోదీని జగన్‌ ఏనాడైనా వ్యతిరేకించారా? మోదీ పాదాలపై వంగిన జగన్‌.. ఏనాడైనా తన తల్లి పాదాలను తాకారా? ఫొటోలు చూపగలరా?’ అని సవాల్‌ విసిరారు.

Updated Date - Aug 16 , 2025 | 07:38 AM