Key IAS Transfers in Andhra Pradesh: ఆర్టీఐహెచ్ సీఈవోగా ధాత్రిరెడ్డి
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:32 AM
రతన్ టాటా ఇన్నోవేషన్ హాబ్ (ఆర్టీఐహెచ్) సీఈవోగా 2020 బ్యాచ్‌కు చెందిన పి. ధాత్రి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె ఏలూరు జిల్లా..
ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ
డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా సౌర్యమాన్ పటేల్
ముగ్గురు ఐఏఎ్‌సలను బదిలీ చేసిన ప్రభుత్వం
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : రతన్ టాటా ఇన్నోవేషన్ హాబ్ (ఆర్టీఐహెచ్) సీఈవోగా 2020 బ్యాచ్‌కు చెందిన పి. ధాత్రి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవోగాను ధాత్రిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గీతాంజలి శర్మను ప్రభుత్వం
నియమించింది. ప్రస్తుతం ఆమె కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగాను గీతాంజలి శర్మకు అనదపు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం పటేల్ పాడేరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పటేల్‌కు ఆర్టీజీఎస్ అదనపు సీఈవోగాను అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఈ ముగ్గురు ఐఏఎ్‌సలను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ముగ్గురూ ఆర్టీజీఎస్ (రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కార్యదర్శితో సమన్వయం చేసుకోవాలని కోరారు. కాగా, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య ఇప్పటివరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతల నుంచి ఆయనను రిలీవ్ చేశారు.
‘రెరా’ చైర్‌పర్సన్‌గా శివారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా శివారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కొత్త బాధ్యతల్లో చేరేముందుగా మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అందించాలని ఆదేశించింది. ఏపీ రియల్‌ఎస్టేట్ (రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్) యాక్ట్ - 2016, 2017 ప్రకారం ఆయనను నియమించింది. ఈ మేరకు మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, శివారెడ్డి అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు.