Share News

రేపు ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:05 AM

ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ ఐక్యసంఘాల ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు.

రేపు ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా

నంద్యాల ఎడ్యు కేషన, జూలై 31 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ ఐక్యసంఘాల ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. నంద్యాల టీచర్స్‌ ఫెడరేషన కార్యాలయంలో గురువారం ఐక్య ఉపాధ్యాయసంఘాల నాయకులు శివయ్య, దస్తగిరిల ఆధ్వర్యంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఫ్యాప్టో నాయకుల శివయ్య, దస్తగిరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించి బోధనకే పరిమితం చేయాలని, హైస్కూల్‌ ప్లస్‌లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి యధాతధంగా కొనసాగించాలని, ఎంఈవో 1 పో స్టులను ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలనే తదితర సమస్యలపై ధర్నా చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో నాయకులు మౌలాలి, గోపాలకృష్ణ, రామచంద్రారెడ్డి, పుల్లయ్య, సాంబశివుడు, లక్ష్మణ్‌నాయక్‌, రామకృష్ణారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు,

Updated Date - Aug 01 , 2025 | 12:05 AM