గంజాయి సాగును నియంత్రించాం: డీజీపీ
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:32 AM
రాష్ట్రంలో గంజాయి సాగును నియంత్రించామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు.
విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్), నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి సాగును నియంత్రించామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఆదివారం ఈగల్ ఆధ్వర్యంలో విజయవాడలో 10 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వాడకంతో జరిగే అనర్థాలను వివరించారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో... సైకిల్ తొక్కు బ్రో’ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. డీజీపీ సైతం ప్లకార్డు పట్టి సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరుతోందని, దేశాన్ని ప్రేమించేవారు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు, డీసీపీ సరిత తదితరులు పాల్గొన్నారు.