DGP Harish Kumar Gupta: గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాం
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:15 AM
రాష్ట్రంలో గంజాయి సాగును పూ ర్తిగా నిర్మూలించామని డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా చెప్పారు. అయితే పక్క రాష్ట్రం నుంచి రవాణా అవుతోందని, దీనిని కూడా కట్టడి చేసేందుకు...
స్మగ్లర్లు ఉగ్రవాదులతో సమానం: డీజీపీ
విశాఖలో 10,147 కిలోల గంజాయి దహనం
విశాఖపట్నం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి సాగును పూ ర్తిగా నిర్మూలించామని డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా చెప్పారు. అయితే పక్క రాష్ట్రం నుంచి రవాణా అవుతోందని, దీనిని కూడా కట్టడి చేసేందుకు ఈగల్ టీమ్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రత్యేక ఫోర్స్‌లను రంగంలోకి దింపాలని భావిస్తున్నామని తెలిపారు. విశాఖలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 10,147 కిలోల గంజాయిని నగర శివారులోని కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో దహనం చేసే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడే మాఫియాను ఉగ్రవాదులుగానే భావించి వారిపై యుద్ధం సాగిస్తున్నామన్నారు. ఈ యుద్ధంలో చా లావరకు విజయం సాధించామని, చివరి లింక్‌ను కూడా తెగ్గొట్దేందుకు యుద్ధా న్ని మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. ఎక్కడైనా గంజాయి పట్టు బడితే.. ఎవరు సరఫరా చేశారు? ఎవరు రవాణా చేస్తున్నారు? ఎవరికి చేరుతోంది? తదితర లింకులన్నింటినీ ఛేదిస్తున్నామని చెప్పారు. 132 మందిని అరెస్టు చేశామన్నారు. 533 ఎన్‌డీపీఎస్ కేసుల్లో 1,435 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో విశాఖ జిల్లాకు చెందినవారు 712 మంది ఉన్నారన్నారు.