పేరుసోమల కోనేరులో పూడికతీత
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:13 AM
మండలంలోని పేరుసోమల గ్రామంలో ఆదివారం చిన్న కోనేరును మన ఊరు- మనగుడి -మన బాధ్యత అంటూ గ్రామస్థులు పూడికతీశారు.

సంజామల,ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని పేరుసోమల గ్రామంలో ఆదివారం చిన్న కోనేరును మన ఊరు- మనగుడి -మన బాధ్యత అంటూ గ్రామస్థులు పూడికతీశారు. ఇరవై ఏళ్ల నుంచి పూడికతో నిండిపోయిన చిన్న కోనేరును గ్రామ పెద్దలు బెలుం సురేష్ రెడ్డి, చిన్న శేఖర్, శివశంకర్ రెడ్డి, నాగిరెడ్డి, ఏళ్ల శ్రీనివాసులు, శీలా వెం కటేశ్వర్లు, ఖాజా రహమతుల్లా, నరసింహ మూర్తి ఆధ్వర్యంలో గ్రామ స్థులు శుభ్రం చేశారు. కార్యక్రమానికి మన ఊరు మన గుడి రాష్ట్ర అధికారి శివశంకర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది అరికట్ల మల్లికార్జున రెడ్డి, ఈవోపీఆర్డీలు ఆర్.కె నాయుడు, రాధికా రెడ్డి, పేరుసోమల సైన్స సీనియర్ ఉపాధ్యాయుడు మేడా హరిప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.