Share News

శిఖరం టోల్‌గేట్‌ వద్ద భక్తుల దౌర్జన్యం

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:34 PM

అటవీ ప్రాంతంలోకి రాత్రి 9గంటలు దాటిన తరువాత అనుమతి ఉండదని చెప్పిన ఇద్దరు గార్డులతో వాగ్వాదానికి దిగి దౌర్జన్యంగా టోల్‌గేటు తెరుచుకుని మధ్యప్రదేశ, గుజరాతకు చెందిన 17 వాహనాలు దోర్నాల వైపునకు బలవంతంగా దూసుకెళ్లడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

శిఖరం టోల్‌గేట్‌ వద్ద భక్తుల దౌర్జన్యం

ఇద్దరు గార్డులను తొసివేసి గేటు దాటిన 17 వాహనాలు

దోర్నాల వద్ద అడ్డుకున్న అధికారులు

ఒక్కో వాహనానికి రూ. 2000 జరిమానా

శ్రీశైలం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : అటవీ ప్రాంతంలోకి రాత్రి 9గంటలు దాటిన తరువాత అనుమతి ఉండదని చెప్పిన ఇద్దరు గార్డులతో వాగ్వాదానికి దిగి దౌర్జన్యంగా టోల్‌గేటు తెరుచుకుని మధ్యప్రదేశ, గుజరాతకు చెందిన 17 వాహనాలు దోర్నాల వైపునకు బలవంతంగా దూసుకెళ్లడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దోర్నాల చెక్‌పోస్టువద్ద భారీగా మోహరించిన అటవీశాఖ సిబ్బంది 17 భారీ వాహనాలను అడ్డుకోని తిరిగి సున్నిపెంట ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అటవీ జంతువుల సంరక్షణ కోసం విధించిన నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా విధులు నిర్వహిస్తున్న గార్డులను బెదిరించినందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వాహన యజమానులను ఫారెస్ట్‌రేంజర్‌ పరమేశులు హెచ్చరించి ఒక్కో వాహనానికి రూ. 2000 జరిమానా విధించినట్లు సమాచారం. ఈ విషయంపై వివరాలు తెలియజేసేందుకు అటవీశాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

Updated Date - Dec 07 , 2025 | 11:34 PM