శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:17 PM
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు.
నంద్యాల కల్చరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. కార్తీకమాసం సందర్భంగా బుధవారం రాష్ట్రం నుంచే కాకుండా పక్కరాషా్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శిఽంచుకున్నారు. భక్తులు ఓంనమశ్శివాయ అంటూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆలయ అధికారులు తాగునీరు, అల్పాహారం అందించారు.