Share News

Devji Family: దేవ్‌జీని కోర్టులో హాజరు పరచాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 06:49 AM

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీకార్యదర్శి దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతిని కోర్టులో హాజరు పరచాలంటూ ఆయన తమ్ముడి కుమార్తె సుమ ఏపీ ఉప ముఖ్యమంత్రి...

Devji Family: దేవ్‌జీని కోర్టులో హాజరు పరచాలి

  • ఏపీ డిప్యూటీ సీఎంకు దేవ్‌జీ తమ్ముడి కుమార్తె లేఖ

కోరుట్ల, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీకార్యదర్శి దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతిని కోర్టులో హాజరు పరచాలంటూ ఆయన తమ్ముడి కుమార్తె సుమ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణకు ఎక్స్‌లో లేఖను పోస్టు చేశారు. ఆ లేఖలో వివరాలు... ‘మా పెద్దనాన్న తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ వార్తలు నిజామా? కాదా? అనేది మా కుటుంబానికి స్పష్టంగా తెలియడం లేదు. కానీ ప్రతి రోజు వినిపించే ఈ సమాచారం మా కుటుంబాన్ని తీవ్ర కలిచివేతకు గురి చేస్తోంది. ఒకవేళ ఈ వార్త లు నిజమే అయితే దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరిచేలా చూడాలి లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలని మా కుటుంబం తరపున మిమ్మ ల్ని వేడుకుంటున్నా. 40 ఏళ్లుగా మా కుటుంబం ఆయన కోసం ఎదురు చూడని రోజు లేదు. సర్‌ మీపై మాకున్న నమ్మకం చాలా పెద్దది. ఒక అభిమానిగా, జనసేన పార్టీ కార్యకర్తగా మిమ్మ ల్ని చేతులెత్తి వేడుకుంటున్నాం. మా కుటుంబానికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారని విశ్వసిస్తు న్నాం.’ ఈలేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Updated Date - Dec 01 , 2025 | 06:49 AM