Revenue Officials: 53 ఎకరాలు ఆక్రమించిన దేవిరెడ్డి
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:24 AM
జగన్ హయాంలో కడప జిల్లాలో వైసీపీ నేతలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. విలువైన భూములను స్వాధీనం చేసుకున్నారు. అధికార యంత్రాంగం కూడా వారికి సహకరించింది. జగన్‌కు నమ్మిన బంటు, ఎంపీ అవినాశ్‌రెడ్డికి...
మే నెలలో ఫిర్యాదు.. స్వాధీనానికి ఆదేశం
(కడప-ఆంధ్రజ్యోతి)
జగన్ హయాంలో కడప జిల్లాలో వైసీపీ నేతలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. విలువైన భూములను స్వాధీనం చేసుకున్నారు. అధికార యంత్రాంగం కూడా వారికి సహకరించింది. జగన్‌కు నమ్మిన బంటు, ఎంపీ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఏకంగా 53 ఎకరాలు ఆక్రమించేశాడు. లింగాల మండలం దొండ్లవాగు సమీపంలో సర్వే నంబర్లు 15, 150, 361-పీ1, 380/1లో మొత్తం 53.15 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో అధీనంలో ఉంచుకుని, తన కుటుంబ సభ్యుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నాడు. అక్కడ చీనీ, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. అవి ప్రభుత్వ భూములని తెలిసినా కూడా నాడు అధికార యంత్రాంగం కనీసం అటు వైపు చూసే సాహసం చేయలేదు. వైసీపీ నేతల భూకబ్జాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు రాసింది. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఈ ఏడాది మేలో ఆ భూ కబ్జాలపై ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు విచారించి.. ప్రభుత్వ భూములుగా గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకోవలసిందిగా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.