Share News

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:39 PM

పట్టణంలో అండర్‌ డ్రైనేజీ, పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.

 అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
పనులను పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

· రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో అండర్‌ డ్రైనేజీ, పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. మంగళవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. పాతబస్టాండ్‌ సమీపంలో రోడ్డుకు ఆనుకొని ఉన్న విద్యుత స్తంభాల వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, స్తంభాలను పక్కకు తరలించా లని విద్యుత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే షాదీ ఖానా భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సాధ్యమైనంత మేరకు పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు నారాయణరెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈ నాగశ్రీనివాసులు, ఏఈ రమణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సాయికృష్ణ, షేక్షా, అబ్దుల్‌ రహీం పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన నూతన ఎస్‌ఐ

బనగానపల్లె నూతన ఎస్‌ఐగా కల్పన మంగళవారం బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దనరెడ్డిని మంత్రి క్యాంపు కార్యా లయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ప ట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మంత్రి సూచించారు.

సొసైటీ అభివృద్ధికి కృషి చేయండి

సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దనరెడ్డి సూచిం చారు. మంగళవారం భానుముక్కల సొసైటీ చైర్మనగా నియమితులైన అత్తార్‌ కలాం క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. తనను సొసైటీ చైర్మనగా నియమించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మనగా నియమితులైన గడ్డం వెంకటేశ్వరరెడ్డి మం గళవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 19 , 2025 | 11:39 PM