Share News

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:01 AM

కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నందానూనెపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని శాఖలు కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేకంగా జలజీవ న మిషన, ప్రధానమంత్రి వికసిత భారత యోజన, కృషి వికాస్‌ యోజన, పోషణ్‌ అభియాన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, మిషన వాత్సల్య, త్రిషోన్నతి యోజన, పీఎంఏవై (అర్బన), పీఎం ఆది ఆదర్శ గ్రామ యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి పథకానికి సంబంధించి మంజూరైన మొత్తం నిధులు, ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం, పథకం అమలవుతున్న ప్రాంతా లు, మిగిలి ఉన్న నిధులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, పనులు పూర్తయ్యే గడువు వంటి వివరాలతో మంగళవారంలోగా క్లుప్తంగా నివేదిక లను అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

గ్రీట్‌ విత గ్రీన పోస్టర్ల ఆవిష్కరణ

రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో రూపొందించిన గ్రీట్‌ విత గ్రీన పోస్టర్లను కలెక్టర్‌ రాజకుమారి సోమ వారం ఆవిష్కరించారు. పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ని ర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడు తూ.. నూతన సంవత్సర వేడుకలను బొకేలు, కేకులు వంటి సంప్రదాయ పద్ధతులకు బదులుగా మొక్కలు, విద్యా సామగ్రి అందజేసే విధంగా చేసుకోవాలని అధికారులకు సూచించా రు. జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ అధికారుల నుంచి సేకరించిన మొక్కలను ప్రభుత్వ సంస్థల్లో నాటడం, అలాగే సేకరించిన విద్యాసామగ్రిని వసతిగృహాల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన దస్తగిరి పర్ల, సెక్రటరీ, జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి శ్రీకాంతరెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మానబాషా, అటవీ శాఖ అధికారి అబ్దుల్‌ సమీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 12:01 AM