అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:30 AM
పట్టణంలో జరగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.
రోడ్లు, భవనాల శాఖ
మంత్రి బీసీ జనార్దనరెడ్డి
పట్టణంలో సుడిగాలి పర్యటన
బనగానపల్లె, జూలై 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలో జరగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. గోపాల్‌నగర్‌లో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనులను పరి శీంచారు. బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. కిచెన రూం, బియ్యం నిల్వ ఉన్నగదిని మంత్రి పరి శీలించారు. భోజనం, నాణ్యతా ప్రమాణా ల ను స్వయంగా పరిశీ లించారు. ఈనెల 5న పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వి జయవంతం చేయా లని ఉపాధ్యాయుల ను కోరారు. పాఠశాల లో టాయ్‌లెట్ల నిర్మా ణం కోసం రూ. 20ల క్షలు మంజూరు చేస్తా మని హామీ ఇచ్చారు. అలాగే షాదీఖానా భ వన నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరి తగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. అనంతరం జుర్రేరు వాగు సుందరీకరణ పనులను పరిశీలించారు. అలాగే గోపాల్‌నగర్, ఖాజీవాడ, ఆస్థానం రోడ్డు, లాల్‌మసీదు వీధి, పోలీస్‌స్టేషన వెనుక వీధుల్లో పూరైయిన పనులను పరిశీ లించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ నాగశ్రీ శ్రీనివాసులు, బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్, విద్యుత ఏఈ శ్రీనివాసులు, ఏఈ సాయికృష్ణ, రమణ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది , విద్యుత సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వి నతులు స్వీకరించారు. కార్యక్రమంలో పలువు రు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు: మంత్రి బీసీ
బనగానపల్లె: అర్హులందరికీ ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు రోడ్లు భవ నాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. మంగళవారం ప ట్టణంలోని గోపాల్‌నగర్‌లో లబ్ధి దారుల ఇళ్లకు వెళ్లి మంత్రి పిం ఛన్లు పంపిణీ చేశారు. పలువు రు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకరాగా పరిష్కరిస్తా నని హామీ ఇచ్చారు. మంత్రి బీసీ మాట్లాడుతూ బనగా నపల్లె నియోజకవర్గంలో 426మందికి లబ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేశా మన్నారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకు పోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కా ర్యక్రమంలో టీడీపీ నాయకులు వంగల పరమేశ్వరరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, ఉపసర్పంచ బురానుద్దీన, నాయకులు కాశీంబాబు, రఫీ, కృష్ణారెడ్డి, పూలకలాం, అల్తాప్‌హుసేన, ఎంపీడీవో నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.