Share News

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:16 AM

పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న మంత్రి

మంత్రి బీసీ జనార్దనరెడ్డి

పట్టణంలో సుడిగాలి పర్యటన

బనగానపల్లె, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని కరీముద్దీన కాలనీ, కరీంబాగ్‌ వీధి, కాజీవాడ, జీఎం టాకీస్‌ వీధి, పెద్దపీర్లచావిడి, మంగళవారంపేటలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే కరణం మొహిద్దీన కాలనీ వీధిలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. పలుకాలనీలోని మహిళలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ నాగశ్రీనివాసులు, విద్యుత ఏఈ శ్రీనివాసులు, అల్తా్‌పహుసేన, గోపాల్‌రెడ్డి, భానుముక్కల సొసైటీ చైర్మన కలాం, రహిమాన, తదితరులు పాల్గొన్నారు.

సచివాలయం తనిఖీ

పట్టణంలోని సచివాలయం- 2 సమీప పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామ సచివాలయ రికార్డులను, సచివాయల సిబ్బంది అటెండెన్సును పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై గ్రామ సచివాలయ సిబ్బందితో, ప్రజలతో ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సేవలందిచాలని అఽధికారులను మంత్రి ఆదేశించారు. సచివాలయంలో పిచ్చిమొక్కలను తక్షణమే తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కరాటే పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల హర్యాణలోని కురుక్షేత్రంలో కరాటే అసోసియేషన ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్‌ చాంపియనషి్‌ప-2025 పోటీలు నిర్వహించారు. బనగానపల్లె జెన స్పోర్ట్స్‌ ఆండ్‌ ఆర్ట్స్‌ అకాడమీకి చెందిన చిన్నారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ విద్యార్థులు ఎ.నాగసాత్విక్‌, ఆర్‌.బాలాజీనాయక్‌ , కె.సాయచరణ్‌ తేజ, దివ్యను ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Sep 13 , 2025 | 12:16 AM