అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే కోట్ల
ABN , Publish Date - May 26 , 2025 | 11:51 PM
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
డోన రూరల్, మే 26 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు, వాటి అమలు, స్థితిగతులపై అధికారులతో చర్చించారు. సూచనలు, సలహాలను ఇచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఓంప్రకాష్, ఆలా మోహన రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, ఏపీవో అబ్దుల్ షుకూర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.