అభివృద్ధే లక్ష్యం: మంత్రి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:29 PM
అభివృద్ధే తమ లక్ష్యమని రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
అవుకు, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధే తమ లక్ష్యమని రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ పన్నుతున్న కుట్రలు, కుతం త్రాలను సాగనీవ్వమన్నారు. శనివారం మండలంలోని శివవరం గ్రా మంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి హాజరైన మంత్రికి గ్రామ టీడీపీ నాయకులు బొల్లపు రాజశేఖర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మల్లు శేఖర్‌రెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రూ. 60 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను అం దజేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ గ్రామంలో తన సొంత నిధులతో రెండు నెలల వ్యవధిలోనే మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నా యకులు ఐవీ పక్కీరరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఐ.ఉగ్రసేనారెడ్డి, బనగానపల్లె మార్కెట్‌యార్డ్ చైర్మన కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, టీడీపీ నాయకులు మొట్ల రామిరెడ్డి, మధుమోహనరెడ్డి, వెంకటరమణనాయక్, దంతెల రమణ, తిక్కన్న, అరుణ్‌కుమార్‌నాయక్, వెంకటరాముడునాయక్, సాంబశివారెడ్డి, పక్కీరగౌడు, పుల్లయ్య, బైరెడ్డి భాస్కర్‌రెడ్డి, శంకర్, జగదీశ్వరరెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.