అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:11 AM
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్ర భుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య
ఇస్కాల గ్రామంలో పింఛన్ల పంపిణీ
పాములపాడు, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్ర భుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. సోమవారం మండలంలోని ఇస్కాల గ్రామంలో టీడీపీ నాయకులు నాగలక్ష్మిరెడ్డి, లింగస్వామి, కలిముల్లలతో కలసి ఇంటింటికి వెళ్లి ఫించన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయిని క్రిష్ణయ్య, బండ్లమూరి వెంకటేశ్వరరావు, లక్ష్మీకాంతరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సురేశ, మోహనగౌడ్, మల్లికార్జున, మండల అధికారులు పాల్గొన్నారు.
నంద్యాల రూరల్: పట్టణంలోని 6 వవార్డులో రాష్ట్ర మైనార్టీస్ పైనాన్స కార్పోరేషన చైర్మెన మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పాణ్యం: పేదల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్ల్లెల రాజశేఖర్ అన్నారు. సోమవారం మండలంలోని మద్దూరు గ్రామంలో ఆయన పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గణపం జయరామిరెడ్డి, ఎంపీటీసీ రంగరమేష్, ముస్లీం మైనార్టీ జిల్లా కార్యదర్శి ఖాదర్ బాషా, సొసైటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఈశ్వరరెడ్డి, మిలిటరీ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నందికొట్కూరురూరల్: మండలంలోని కోనేటమ్మపల్లె గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎనటీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనిట్ ఇనచార్జి దామోదరెడ్డి, గ్రామ నాయకులు బాలీశ్వరుడు, తిరుపాలు, భగవాన, మద్దిలేటి, సుబ్బరాయుడు, గ్రామస్థులు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: మండలంలోని మండ్లెంలో ఎనటీఆర్ భరోసా పింఛన్లను టీడీపీ మండల కన్వీనర్ మోహానరెడ్డి అధికారులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మధు, బూతఇనచార్జి ప్రతాప్, మహానంది వీఆర్వో కరిముల్లా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.