Arya Vaishya Mahasabha: ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా దేవతి
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:00 AM
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన దేవతి భగవన్నారాయణ ప్రమాణస్వీకారం చేశారు.
మంగళగిరి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన దేవతి భగవన్నారాయణ ప్రమాణస్వీకారం చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, అంబికా కృష్ణ తదితర ప్రముఖుల సమక్షంలో దేవతి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆయనతో మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ప్రమాణం చేయించారు. అలాగే, మహాసభ నార్త్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా సాలస గీతాకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాదంశెట్టి సుజాత, ప్రధాన కార్యదర్శిగా ఎస్.పద్మావతి, కోశాధికారిగా పరుచూరు చంద్రిక తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ త్వరలో విజయవాడలో ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేవతి భగవన్నారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు.