Child Students: ఎంత కష్టంలో ఉన్నా అక్షరాన్ని వదలం
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:17 AM
పాడుపడిన పార్కు ప్రహరీయే వాళ్లకు ఆసరా! పూరి పాకలోనే నివాసం! అక్కడే వారి జీవితం! అయినా... చదువును మరువలేదు.
పాడుపడిన పార్కు ప్రహరీయే వాళ్లకు ఆసరా! పూరి పాకలోనే నివాసం! అక్కడే వారి జీవితం! అయినా... చదువును మరువలేదు. బతుకును మార్చే అక్షరాన్ని వదల్లేదు. ఈ పిల్లల పేర్లు వెంకట అశోక్, లక్ష్మి, బాలాజీ. ముగ్గురు పిల్లలు గాంధీ నగర్ మునిసిపల్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ముగ్గురికీ ఇటీవల ‘తల్లికి వందనం’ కింద డబ్బులు జమ అయ్యాయి. వీరి తల్లి మన్నెం రమణమ్మ. నెల్లూరు ఇండస్ట్రియల్ ఏరియాలో వీరి జీవితం. చెక్కముక్కలతో బల్లలు, స్టూళ్లు, బొమ్మలు తయారు చేస్తూ... అక్కడే రోడ్డుమీద పెట్టి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. ఇలా ఇక్కడ పదికిపైగా కుటుంబాలు పాకలు వేసుకుని జీవిస్తున్నాయి.
- నెల్లూరు, ఆంధ్రజ్యోతి