Guntur District: నేడు డిప్యూటీ సీఎం ‘మాటామంతీ’
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:50 AM
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో పంచాయతీరాజ్...
పీఆర్, ఆర్డీ ఉద్యోగులతో పవన్ సమావేశం
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో ‘మాటామంతీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం వరకూ జరిగే ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈవోలు, డ్వామా పీడీలు, పంచాయతీరాజ్ ఎస్‌ఈలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు, జడ్పీ డిప్యూటీ సీఈవోలు, డీడీఓలు, డీఎల్‌పీవోలు హాజరుకావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదేశించారు. మాటామంతీ’లో పాల్గొనాలని ఉపాధి హామీ పథకం డైరెక్టర్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీలు, సోషల్ ఆడిట్ డైరెక్టర్లకు కూడా సమాచారమందించారు.