Deputy CM Pawan Kalyan: పంచాయతీలకే నాలా మార్పు ప్రయోజనం
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:41 AM
నాలా చట్టం అంశంపై గురువారం ఏపీ క్యాబినెట్ సమావేశంలో చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు.
నాలా చట్టంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం సూచన... స్వాగతించిన సీఎం
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): నాలా చట్టం అంశంపై గురువారం ఏపీ క్యాబినెట్ సమావేశంలో చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. నాలా చట్టం మార్పు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రంలోని పంచాయతీలకు అందించాలని ఆయన సూచించారు. తద్వారా గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. గ్రామాల వృద్ధి, అభ్యున్నతికి ఆ నిధులు వెచ్చించవచ్చన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన తాగునీరు, పారిశుధ్యం, డ్రైన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, రోడ్ల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయడం వల్ల గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. పవన్ చేసిన సూచనలను స్వాగతించిన సీఎం చంద్రబాబు... నాలాపై ఇచ్చే జీఓలో పవన్ కల్యాణ్ ప్రతిపాదనలను చేర్చాలని అధికారులను ఆదేశించారు.