Share News

Deputy CM Pawan: యువత.. పాతికేళ్ల భవిత కోరుతున్నారు

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:44 AM

జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదివారం చేసిన ట్వీట్‌ సంచలనం రేపుతోంది. ఏపీ యువత పాతికేళ్ల భవిష్యత్‌ కోరుతున్నారని..

Deputy CM Pawan: యువత.. పాతికేళ్ల భవిత కోరుతున్నారు

  • ఉచితాలు, పథకాలు కాదు!

  • పవన్‌ కల్యాణ్‌ సంచలన ట్వీట్‌

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదివారం చేసిన ట్వీట్‌ సంచలనం రేపుతోంది. ఏపీ యువత పాతికేళ్ల భవిష్యత్‌ కోరుతున్నారని.. ఉచితాలు, సంక్షేమ పథకాలు కాదని ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 2018 అక్టోబరు 12న పవన్‌ ఉత్తరాంధ్ర పర్యటనలో కొందరు యువకులతో భేటీ నిర్వహించి చర్చలు జరిపారు. అప్పటి ఫొటోను పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తాజాగా పోస్టుచేశారు. దానిని పవన్‌ ట్యాగ్‌ చేస్తూ.. ‘ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగడం లేదు. పాతికేళ్ల భవిష్యత్‌ను అడుగుతున్నారు. అందుకే తరచూ వారిని కలుస్తూ వారి కలలను నిజం చేసేందుకు కృషిచేస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. ఇది సర్వత్రా చర్చకు దారితీసింది.

Updated Date - Oct 13 , 2025 | 04:46 AM