Deputy CM Pawan: మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవాలి
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:25 AM
ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారు ల జీవితాల్లో మెరుగైన మా ర్పులు తెచ్చేందుకు కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
100 రోజుల ప్రణాళికపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమీక్ష
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారు ల జీవితాల్లో మెరుగైన మా ర్పులు తెచ్చేందుకు కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో శుక్రవారం ఆయన సమీక్షించారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ప్ర స్తావించిన సమస్యల పరిష్కారానికి అమలుచేస్తున్న 100 రోజుల ప్రణాళికలో భాగంగా తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. మత్స్యకారుల వేట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని, అదనపు ఆదాయ సముపార్జన పై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సీఎంఎఫ్ఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త జోయ్ కే కిజాకుడాన్ సలహాలు తీసుకుని, వాటిని అమలు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని కాకినాడ కలెక్టర్‌కు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ పాల్గొన్నారు.
సేనతో సేనాని..లో భాగస్వామ్యంకండి..
కార్యకర్తలకు జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను తీసుకొచ్చేందుకు.. సమాజంలో మార్పును కాంక్షించే ప్రతీ ఒక్కరికీ మాతృభూమికి తమ వంతు సేవలందించే అవకాశం కల్పించేందుకు చేపట్టిన ‘సేనతో సేనాని..’ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘‘సేనతో సేనాని-మన నేల కోసం కలిసి నడుద్దాం’’ పేరిట ఒక పోస్టర్‌ను శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకు ని సేవలందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని చెప్పారు. ‘మార్పు కోరుకుంటే రాదు.. ప్రయత్నిస్తే వస్తుం ది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను..’ అని ఎక్స్ వేదికగా పవన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు పోస్టర్‌లో తాము ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, లేదా తాము ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కాగా, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఈ కార్యక్రమంలో చేరిన వారి నుంచి పార్టీ కార్యాలయం కొంతమందిని ఎంపిక చేసి త్వరలో ఫేజ్-1లో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమంలో తుది జాబితా ను ఎంపిక చేసి వారికి ఆసక్తి ఉన్న అంశంపై పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నాయకత్వ శిక్షణ తరగతుల్లో, పార్టీ కీలక కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తారు.