Share News

యోగ నిద్రలో పవన్‌: రాఘవులు

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:09 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ యోగ నిద్రలో ఉన్నారు. బీజేపీకి లొంగిపోయి ఎలా చెప్పాలో అర్థంగాక భాషలను చిన్నమ్మ, పెద్దమ్మగా వర్ణించారు అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు.

యోగ నిద్రలో పవన్‌: రాఘవులు

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ యోగ నిద్రలో ఉన్నారు. బీజేపీకి లొంగిపోయి ఎలా చెప్పాలో అర్థంగాక భాషలను చిన్నమ్మ, పెద్దమ్మగా వర్ణించారు’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. దక్షిణాదిపై హిందీని రుద్దితే కబడ్దార్‌! అంటూ గతంలో హెచ్చరించిన ఆయనే ఇప్పుడు హిందీని రుద్దాలంటున్నారని విమర్శించారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో విలేకరులతో రాఘవులు మాట్లాడారు. ‘రాజ్యాంగంలో అన్ని భాషలూ సమానమే. హిందీని అనుసంధాన భాషగా ప్రోత్సహించాలేగాని బలవతంగా రుద్దకూడదు. సుప్రీం కోర్టులో కేసు ఉండగానే బిహార్‌ తరహాలో ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఇతర రాష్ట్రాలకు సీఈసీ లేఖలు పంపించడం బీజేపీ అనుకూల చర్య తప్ప మరొకటి కాదు’ అని అన్నారు.

టూరిజం రెస్టారెంట్లు, హోటళ్లను ప్రైవేటీకరించొద్దు

ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాభదాయకంగా నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లను ప్రైవేటీకరించే ప్రతిపాదనలను విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎంకు సోమవారం లేఖ రాశారు.

Updated Date - Jul 15 , 2025 | 05:09 AM