Deputy CM Pawan: మీకు యోగి ట్రీట్‌మెంటే కరెక్ట్
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:10 AM
ప్రభుత్వం తలచుకుంటే 48 గంటల్లో.. కిరాయి గ్యాంగ్‌లను మెయింటెన్ చేసే వ్యక్తుల చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు.. వాళ్ల పేరేంటో కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఏమవుతారో ఆలోచించండి.
రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి?
మళ్లీ మేమొస్తాం.. జైలుకు పంపుతాం వంటి బెదిరింపులకు మేం భయపడం
బలమైన నక్సలిజమే కకావికలమైంది.. మీరెంత?
గీత దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు తీసేస్తాం
జగన్ అండ్ కోకు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్
అంబేడ్కర్, గాంధీ, పొట్టిశ్రీరాములుకు కులం అంటగడితే భారతీయులుగా ఉండలేమని వ్యాఖ్య
అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన
రాజమహేంద్రవరం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వం తలచుకుంటే 48 గంటల్లో.. కిరాయి గ్యాంగ్‌లను మెయింటెన్ చేసే వ్యక్తుల చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు.. వాళ్ల పేరేంటో కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఏమవుతారో ఆలోచించండి. అక్కడి వరకు తీసుకెళ్లకండి. మళ్లీ మేమొస్తాం. అందరినీ జైలుకు పంపిస్తాం అనే బెదిరింపులకు మేం భయపడం. కానీ అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ల వెనుక చాలామంది రౌడీలు ఉంటారని చెవిలో చెబుతున్నారు. ఇంత కిరాయి హంతకులు ఉన్నారంటే మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్‌మెంటే కరె క్ట్. రౌడీయిజం అన్నవాడి కాలుకు కాలు, కీలుకు కీలు మడతపెట్టి మూలన కూర్చోపెడితేనే తెలిసొస్తుంది. కరడుగట్టిన వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు.. ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన నక్సలైట్ల ఆర్గనైజేషనే కకావికలం అయిపోయింది. మీ రెంత’ అని వైసీపీ అధినేత జగన్ అండ్ కోకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ని పెరవలిలో అమరజీవి జలధార పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కందుల దుర్గేశ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడా రు. ‘ప్రతిపక్ష హోదా కూడా లేని గత సీఎం పార్టీ వాళ్లు చాలా మాట్లాడుతూ ఉంటారు.
వాళ్లకు ఒకటే చెబుతున్నా.. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకు, దౌర్జన్యాలకు మేం భయపడలేదు. మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరినీ చంపేస్తాం.. మ ళ్లీ మేం వస్తాం అని అంటున్నారు. పిఠాపురం వంటి చోట చిన్నపిల్లల మధ్య క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చారు. మీ రాజకీయాల కోసం మాట్లాడడానికి వేరే దారులులే వా? సిగ్గుందా? కాంట్రాక్టులు చేస్తే జైలులో పెడతామని బెదిరిస్తున్నారు. మేమేం మారలేదు గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే.. నాకు అధికారం ఉన్నా, లేకున్నా ఎప్పుడూ పవన్‌లాగే ఉంటాను. భయపడను. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తామో లేదో అని డిసైడ్ అయ్యే వెళతాం’ అని అన్నారు.
2027కు అమరజీవి జలధార పూర్తి
‘అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో రూ.7,910 కోట్లు ఖర్చుపెడుతున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా 30 ఏళ్లలో 1.2 కోట్లమందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలతో కలిపి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందివ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉం ది. 2027 నాటికి పనులు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. గతంలో పాలకులు జలజీవన్ మిషన్‌లో ఇంటింటికీ ట్యాప్‌లు వేశారు. కానీ నీళ్లు ఇవ్వలేదు. రోడ్లు, జలజీవన్ మిషన్‌లో నాణ్యత లోపిస్తే కఠిన పనిష్మెంట్ ఉం టుంది. నాడు బూర్గుల రామకృష్ణారావు తెలుగు వారందరూ ఏకంగా కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి సీఎం పదవి త్యాగం చేశారు. తెలుగుజాతి, తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడడానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. వాటర్ గ్రిడ్‌కు ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తే అమరజీవి పేరు తప్ప ఇంకేమీ రాలేదు. హక్కుల కోసం పోరాడేవారిని ఆరాధించాను. అందువల్లే.. పార్టీ పెట్టి పదేళ్లు అయినా సీట్ల విషయంలో తగ్గాను. అమ్మేశానని ఒకడు, దిగజారిపోయానని ఇంకొకడు అన్నాడు. అమరజీవి జలధార సాక్షిగా చెబుతున్నా.. రాష్ర్టానికి మంచి జరగాలని, ప్రజలకు మంచి జరగాలని మాత్రం ముందుకు వస్తున్నాను. నాకు స్వార్థం లేదు. ప్రధానమంత్రి కూడా నేనున్న సభలకు రావడానికి ఆలోచించాల్సి వస్తోంది. ప్రధాని భద్రత చూసే స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్సు... తమకు ఇబ్బంది అవుతుందని, తోసుకుని ముందుకు వచ్చేస్తున్నారని, మీ వాళ్లకు బాధ్యత చెప్పండి అని అంటుంటారు.’ అని అభిమానులకు పవన్ చెప్పారు.
35 కోట్లతో కొండగట్టులో మండపం
‘తెలంగాణలోని కొండగట్టు అంజన్న అంటే నాకు ఇష్టం. దర్శనానికి వెళ్తే భక్తులు 2 వేలమందికి దీక్షా విరమణ మండపం కావాలని చెప్పారు. 96 గదుల ఈ మండపం కోసం రూ.35.19 కోట్లతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు, పాలకమండలికి కృతజ్ఞతలు.’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
పద్ధతులు మార్చుకోండి
‘మీ ఆకు రౌడీలు అంటే అధికారులు కూడా భయపడుతున్నారు. సామాజిక మాధ్యమాలు, విదేశాల్లో కూర్చుని మాట్లాడేవాళ్లతో సహా ఇక్కడ కూ ర్చుని భవిష్యత్‌లో మేమొస్తాం.. ఏదో చేస్తాం అంటున్నారు. మీరు వచ్చినపుడు ఏం చేశారు? బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నారా? పార్టీ పెట్టి వచ్చామంటే సమాజం, ప్రజలు, రాష్ట్రం, దేశం మీద ఎంత కమిట్‌మెంట్ ఉండాలి. పద్ధతులు మా ర్చుకోండి. ఒక మాట అనాలంటే అనండి.. తప్పేమీ లేదు. కానీ గీతలు దాటి మాట్లాడితే మీ చేతులు ఇక ముద్రలు వేయడానికి ఉండవు. మీ చేతుల్లో గీతలు తీసేస్తాం. సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన కలెక్టర్ల మీటింగ్‌లో రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులు వద్దని చెప్పాను. వైసీపీ నేతలకు చెబుతున్నా. వైసీపీ నుంచి మా పార్టీలోకి కొందరు నేతలు వచ్చారు. వాళ్లు బ్యాలెన్స్‌గానే ఉన్నారు. కానీ మీరు పాత పద్ధతిలోనే ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు.’ అని పవన్ అన్నారు.