Share News

Health Update: డిప్యూటీ సీఎం పవన్‌కు తగ్గని జ్వరం

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:37 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కొంతకాలంగా ఆయన మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలోనే ఉంటున్నారు.

Health Update: డిప్యూటీ సీఎం పవన్‌కు తగ్గని జ్వరం

చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ పయనం

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కొంతకాలంగా ఆయన మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలోనే ఉంటున్నారు. ఈ సమయంలో ఆరోగ్య సమస్య లు రావడంతో నాలుగు రోజులుగా క్యాంప్‌ కార్యాలయంలోనే వైద్యం చేయించుకుంటున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్నా జ్వర తీవ్రత తగ్గలేదు. మరోవైపు దగ్గు కూడా ఎక్కువగా ఉండటంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షల చేయించుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. కాగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పరామర్శించారు. ఎక్స్‌ వేదికగా పోస్టు చేసి న ఆయన, పవన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పవన్‌ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వైరల్‌ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పవన్‌ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవ కొనసాగించాలని, ఓజీ విజయాన్ని ఆస్వాదించాలని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు.

Updated Date - Sep 27 , 2025 | 04:38 AM