Share News

అటవీ సిబ్బంది భద్రతకు సంజీవని: పవన్‌

ABN , Publish Date - Nov 11 , 2025 | 05:58 AM

అడవుల్ని రక్షించేందుకు కృషి చేస్తున్న అటవీ సిబ్బంది ప్రతిఒక్కరికీ అండగా నిలుస్తాం. వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సంజీవని ద్వారా...

అటవీ సిబ్బంది భద్రతకు సంజీవని: పవన్‌

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘అడవుల్ని రక్షించేందుకు కృషి చేస్తున్న అటవీ సిబ్బంది ప్రతిఒక్కరికీ అండగా నిలుస్తాం. వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ‘సంజీవని’ ద్వారా అవసరమైన చర్యలు చేపడుతుంది’’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. ‘అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నా. ప్రతి అమర వీరుని వెనుక ఒక కుటుంబం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాల పక్షాన నిలిచి, వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది’ అని పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 05:59 AM