Share News

Deputy CM Pawan:దృఢ సంకల్పంతో విద్యావ్యవస్థలో మార్పులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 04:35 AM

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జెడ్పీ పాఠశాలలో పీటీఎం 3.0కి హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

Deputy CM Pawan:దృఢ సంకల్పంతో విద్యావ్యవస్థలో మార్పులు

  • మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ అభినందనలు

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జెడ్పీ పాఠశాలలో పీటీఎం 3.0కి హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై పవన్‌ స్పందించారు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషకాహారం, నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో, మీరు చేస్తున్న కృషి అభినందనీయమని లోకేశ్‌ను అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసేలా నిర్వహిస్తున్న మెగా పీటీఎంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

అంబేడ్కర్‌కు పవన్‌ నివాళులు

ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం రూపకల్పనలో మూలస్తంభంగా నిలిచిన డాక్టర్‌ బి.ఆర్‌. ఆంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు. అణగారిన వర్గాలకు, మహిళలు, కార్మిక వర్గాలకు చట్టబద్ధమైన హక్కులు లభించడానికి రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన అంశాలే కారణమని గుర్తుచేశారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌, ఆయన బృందం పాటించిన విలువల గురించి నేటి తరం తెలుసుకోవాలని, ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పవన్‌ ఆకాంక్షించారు.

Updated Date - Dec 07 , 2025 | 04:36 AM