Share News

Deputy CM Pawan: అందరి నమ్మకాన్నీ వమ్ము చేశారు

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:34 AM

గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు, అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Deputy CM Pawan: అందరి నమ్మకాన్నీ వమ్ము చేశారు

  • గత టీటీడీ బోర్డు, అధికారులు..భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు

  • నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడూ మోసపోయాడు

  • తిరుమల ఆలయం.. భక్తికి మూలం: పవన్‌

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు, అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సోమవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ‘‘తిరుమల కేవలం ఒక ఆలయం కాదు.. మన భక్తికి మూలం. ప్రగాఢ నమ్మకం, ప్రార్థనలతో తిరుమల వెళ్తాం. గత ప్రభుత్వ హయాంలో అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది భక్తులు సందర్శించారు. దాదాపు ప్రతి రోజూ 60 వేలమంది భక్తులు పవిత్ర మందిరాన్ని సందర్శించారు. సామాన్యుడి దగ్గర నుంచి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడలు, కళలు, సాహిత్య రంగాల ప్రముఖులు, ఎందరో భక్తితో నమస్కరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడు. గత టీటీడీ బోర్డు, అధికారులు మన భక్తికి ద్రోహం చేశారు. గత పాలకులు నియమాలను మాత్రమే ఉల్లంఘించలేదు. వారిపై ఉంచిన అందరి నమ్మకాన్ని వమ్ము చేశారు. మన విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 25 , 2025 | 04:36 AM